శ్రీశైల మల్లన్న భక్తులకు తీపి కబురు.. ట్రస్ట్ బోర్డు సంచలన నిర్ణయాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-19 15:29:25  IST  )

శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో సంచలన నిర్ణయాలు తీసుకుంది.

శ్రీశైల మల్లన్న భక్తులకు తీపి కబురు.. ట్రస్ట్ బోర్డు సంచలన నిర్ణయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో సుమారు వెయ్యి ఎకరాల్లో 150 A-గ్రేడ్ కాటేజీలు, 50 కమ్యూనిటీ సత్రాలు, పార్కింగ్ ప్రదేశాల నిర్మాణం. తిరుమల తరహాలో సమగ్ర అభివృద్ధి చేపట్టేందుకు ఆమోద ముద్ర వేశారు. మల్లమ్మ కన్నీరు ఆలయం నుంచి డంపింగ్ యార్డు వరకు రోడ్ల నిర్మాణం, పాతాళగంగ వద్ద కర్మకాండల కోసం షెడ్ ఏర్పాటు చేయనున్నారు. స్థానిక చెంచు గిరిజనులకు ప్రతి నెల ఒక రోజు మల్లన్న స్పర్శ దర్శనం, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో కోలను భారతి ఆలయాన్ని దత్తత తీసుకోవడానికి ఆమోదం తెలిపారు. రూ.500 టికెట్లతో స్పర్శ దర్శనం పొందిన భక్తులకు 100 గ్రాముల 2 లడ్డూలు, రూ.300 టికెట్లతో 100 గ్రాముల ఒక లడ్డూ ఉచితంగా ఇచ్చేందుకు ట్రస్ట్ బోర్డు ఓకే చెప్పింది. అయితే, ఈ ప్రతిపాదనను డిసెంబర్ 1 నుంచి అమలు చేయబోతున్నట్లుగా అధికారులు వెల్లడించారు.

Next Story