రిటైర్మెంట్ వేళ తీపికబురు.. సీఎస్ సాయిప్రసాద్ పదవీకాలం పొడిగింపు

by Kema Shiva Kumar |

ఆంధ్రప్రదేశ్ సీఎస్ సాయిప్రసాద్ పదవీకాలాన్ని కేంద్రం 6 నెలలు పొడిగించింది.

రిటైర్మెంట్ వేళ తీపికబురు.. సీఎస్ సాయిప్రసాద్ పదవీకాలం పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ (Sai Prasad) పదవీకాలం పొడిగింపునకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన సర్వీసును మరో 6 నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (DoPT) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్ సాయిప్రసాద్ ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో నెలకొన్న పరిపాలనాపరమైన అవసరాలు, కీలక ప్రాజెక్టుల కొనసాగింపు దృష్ట్యా ఆయన సేవలు మరికొంత కాలం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఆయన నవంబర్ 30 వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు.

Next Story