- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YCP: కీలక మీటింగ్‌కు తమ్మినేని, ధర్మాన డుమ్మా.. కారణం అదేనా..?
వైసీపీ కీలక మీటింగ్‌కు తమ్మినేని, ధర్మాన డుమ్మా కొట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 11 సీట్లలో మాత్రమే గెలవడంతో ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకుంది. మరోవైపు పార్టీ నేతలు ఒక్కొక్కరిగా గుడ్ బై చెబుతున్నారు. అయితే గతంలో జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన నేతలు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో స్పీకర్‌గా పని చేసిన తమ్మినేని, మంత్రిగా పని చేసిన ధర్మాన ప్రసాదరావు కూడా అంటీముట్టనట్టు ఉంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బలమైన నేతలుగా చెప్పుకునే వీళ్లిద్దరు.. జిల్లాలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలకు సైతం డుమ్మా కొడుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత శ్రీకాకుళం పార్లమెంట్ ఇంచార్జిగా తమ్మినేనిని జగన్ నియమించారు. అయినా పార్టీలో సెలైంట్‌గానే ఉంటున్నారు. దీంతో తమ్మినేని, ధర్మాన వైఖరి అర్ధంకాక జిల్లా నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.
ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్వంలో తాజాగా శ్రీకాకుళంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. జిల్లాలకు చెందిన చాలా మంది కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు గైర్హాజరయ్యారు. కన్నబాబు తమకంటే జూనియర్ కాబట్టి అందుకే ఆ కార్యక్రమానికి వెళ్లలేదా అంటే ఆయన స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. రాజకీయ అనుభవం విశేషంగా ఉండి కూడా తమ్మినేని, ధర్మాన ధోరణిలో మార్పు రావడంతో తమకు ఏమీ పోలుపోవడంలేదని పార్టీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు. మరి అధినాయకత్వం స్పందించి శ్రీకాకుళం జిల్లాలో పార్టీని రిపేర్ చేస్తుందేమో చూడాలి.
READ MORE ...
మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన.. బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం






