- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Yogandhra 2025 : విశాఖలో 25 వేల మంది విద్యార్థులతో సూర్యనమస్కారాలు.. గిన్నీస్ రికార్డ్
విశాఖపట్నం(Vishakhapatnam)లో విద్యార్థులు సూర్యనమస్కారాలతో గిన్నీస్ వరల్డ్ రికార్డు(Guinness Book Of World Record) ఫీట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం(Vishakhapatnam)లో విద్యార్థులు సూర్యనమస్కారాలతో గిన్నీస్ వరల్డ్ రికార్డు(Guinness Book Of World Record) ఫీట్ చేశారు. నేడు విశాఖలో జరుగుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా యోగాంధ్ర 2025(Yogandhra 2025) కార్యక్రమాన్ని పురస్కరించుకొని 25,000 మంది విద్యార్థులు ఒకేసారి 108 సెట్ల సూర్యనమస్కారాలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు ఫీట్ చేశారు. ఈ భారీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఐటీ, హ్యూమన్ రిసోర్సెస్ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) హాజరయ్యి విద్యార్థులను అభినందించారు.
కాగా ఈ ఈవెంట్‌లో రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక అధికారుల సమన్వయంతో విశాఖపట్నంలోని వివిధ విద్యాసంస్థల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యోగా ద్వారా ఆరోగ్యం, శారీరక దృఢత్వం, యువతలో యూనిటీని ప్రోత్సహించడంతో పాటు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించే దిశగా జరుగుతోంది.






