ఐపీఎస్ అధికారికి ముందస్తు బెయిల్.. ఆశ్చర్యపోయిన సుప్రీంకోర్టు.. ఎందుకంటే?

by Naga Rani Yarlagadda |

ఏపీకి చెందిన ఒక ఐపీఎస్ అధికారి సంజయ్ కు రాష్ట్ర హైకోర్టు (AP High Court) ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ఐపీఎస్ అధికారికి ముందస్తు బెయిల్.. ఆశ్చర్యపోయిన సుప్రీంకోర్టు.. ఎందుకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీకి చెందిన ఒక ఐపీఎస్ అధికారి సంజయ్ కు రాష్ట్ర హైకోర్టు (AP High Court) ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనిపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ (Anticipatory Bail)కు ఆశ్చర్యమెందుకు అనుకుంటున్నారా ? అక్కడే ఉంది అసలు విషయం. ఐపీఎస్ అధికారికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ కు 49 పేజీలను జోడించింది. ఫైర్ డీజీగా ఉన్న సంజయ్ అవినీతికి పాల్పడ్డారని కేసు దాఖలైంది. ఈ కేసులో ఏపీ కోర్టు గతంలో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేసింది.

సంజయ్ అవినీతికి పాల్పడ్డారన్న వాస్తవాలు స్పష్టంగా కనిపిస్తోన్నా.. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందని ప్రభుత్వం తరపున అడిషినల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదించారు. కాగా.. 49 పేజీలతో ముందస్తు బెయిల్ ఇస్తూ తీర్పు ఇవ్వడాన్ని చూసిన ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కేసుకు సంబంధించిన ఒప్పంద పత్రం, ఇన్ వాయిస్ లను సమర్పించాలని ఆదేశించి, తదుపరి విచారణను జులై 30కి వాయిదా వేసింది.

Next Story