సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

by Naga Rani Yarlagadda |

ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు (SC, ST Atrocity Case)లో సజ్జల భార్గవరెడ్డి (Sajjala Bhargava Reddy)కి సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురు అయింది. ట్రయిల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీం ఆదేశించింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు కేవలం రెండు వారాల గడువును ఇచ్చింది.

సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు (SC, ST Atrocity Case)లో సజ్జల భార్గవరెడ్డి (Sajjala Bhargava Reddy)కి సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురు అయింది. ట్రయిల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీం ఆదేశించింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు కేవలం రెండు వారాల గడువును ఇచ్చింది. సోషల్‌ మీడియా దుర్వినియోగం కేసుల్లో త్వరగా బెయిల్ వస్తుందని అనుకోవద్దని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. త్వరగా బెయిల్ వస్తుందని అనుకుంటే ప్రతి ఒక్కరూ ఇష్టారీతిన వ్యవహరిస్తారని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి తప్పు ఎవరు చేసినా తప్పేనని అభిప్రాయపడింది. సోషల్‌ మీడియా (Social Media)లో అసభ్య పోస్టులపై నమోదైన కేసుల్లో తనపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌ (FIR)లను కొట్టివేయాలని భార్గవరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Next Story