- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూడి శ్రీహరికి సుప్రీం కోర్టులో షాక్.. ముందస్తు బెయిల్‌కు నో
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోల మార్ఫింగ్, సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసులో వైసీపీ నేత, మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరికి సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోల మార్ఫింగ్, సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసులో వైసీపీ నేత, మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరికి సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు లేదా విచారణ నుంచి మధ్యంతర ఉపశమనం కలిగించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మార్ఫింగ్ ఫొటోలు, కార్టూన్లు పోస్ట్ చేసిన ఆరోపణలపై పోలీసులు పూడి శ్రీహరిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించాలని కుప్పం ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఆ సమయంలో కుప్పం కోర్టు రిమాండ్‌కు అంగీకరించకుండా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా, కుప్పం కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ.. విచారణకు సహకరించాలని శ్రీహరిని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. తనకు ముందస్తు బెయిల్ కావాలని కోరుతూ పూడి శ్రీహరి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. మంగళవారం (ఏప్రిల్ 28) ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కుప్పం కోర్టు గతంలో ఇచ్చిన రిమాండ్ తిరస్కరణ ఉత్తర్వుల సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. శ్రీహరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం అంగీకరించలేదు. పోలీసుల విచారణకు సహకరించాల్సిందేనని సూచించింది.






