- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆకివీడు ఆలయ నిర్మాణ వివాదం: ప్రతివాదులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఆకివీడు ఆలయ నిర్మాణ వివాదానికి సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు జులై 13వ తేదీకి వాయిదా వేసింది. ఈ వివాదంపై కమిటీ తరఫు న్యాయవాది సుయోధన్ న్యాయస్థానంలో తన వాదనలను వినిపించారు...

దిశ, వెబ్ డెస్క్: ఆకివీడు ఆలయ నిర్మాణ(Akividu Temple Construction) వివాదానికి సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు(Supreme Court) జులై 13వ తేదీకి వాయిదా వేసింది. ఈ వివాదంపై కమిటీ తరఫు న్యాయవాది సుయోధన్ న్యాయస్థానం(Advocate Suyodhan Court)లో తన వాదనలను వినిపించారు. వేసవి సెలవుల కాలంలోనే ఈ కేసుపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. అయితే సుప్రీంకోర్టు సెలవుల అనంతరం పునఃప్రారంభమయ్యాకే ఈ కేసు విచారణను చేపడతామని జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం స్పష్టం చేసింది. గత వారం జరిగిన విచారణ సందర్భంగా ఆలయ నిర్మాణ స్థలంలో యధాతథ స్థితిని (స్టేటస్ కో) కొనసాగించాలని కోర్టు ఇది వరకే ఆదేశాలు జారీ చేసింది.
అలాగే ఈ వివాదానికి సంబంధించి ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు పంపగా, ఆలయ కమిటీ ఇప్పటికే తన కౌంటర్‌ను దాఖలు చేసింది. తదుపరి విచారణ సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మిగిలిన ప్రతివాదులంతా తమ కౌంటర్లను దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.






