Supreme Court: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కి చుక్కెదురు.. సుప్రీం కోర్టు నోటీసులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-01 07:24:32  IST  )

వైసీపీ సర్కార్ హయాంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌గా ఉన్న సంజయ్ (Sanjay) భారీ ఎత్తున అవినీతి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

Supreme Court: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కి చుక్కెదురు.. సుప్రీం కోర్టు నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ సర్కార్ హయాంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌గా ఉన్న సంజయ్ (Sanjay) భారీ ఎత్తున అవినీతి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (Vigilance and Enforcement) ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ (State Government) ఆదేశాల మేరకు ఆయనపై ఏసీబీ (ACB) కేసు నమోదు చేసింది. ఏ1గా సంజయ్‌ (Sanjay), ఏ2గా సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా (Sautrika Technologies and Infrastructure), ఏ3గా క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌ (Kritvyap Technologies) సంస్థ అధినేతలపై ఎఫ్ఐఆర్‌ (FIR)లో చేర్చారు. దీంతో సంజయ్ (Sanjay) కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేయగా.. ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో సంజయ్‌కి బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ అమానుతుల్లా (Justice Amanutullah), జస్టిస్‌ పీకే మిశ్రా (Justice PK Mishra) ద్విసభ్య ధర్మాసనం ఏపీ సర్కార్ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలంటూ ప్రతివాది సంజయ్‌కి ఇవాళ నోటీసులు జారీ చేసింది.

కాగా, అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అధికార, నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు సంజయ్‌ (Sanjay)పై ఆరోపణలు ఉన్నాయి. ట్యాబ్‌ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని, అగ్ని మొబైల్‌ యాప్‌ను తనకు తెలిసిన సంస్థకు కట్టబెట్టారని అభియోగాలు నమోదయ్యాయి. నిబంధనల ఉల్లంఘన, క్రమశిక్షణ రాహిత్యంపై వివరణ ఇవ్వాలని డిసిప్లినరీ ప్రొసీడింగ్స్‌ జారీ చేస్తూ సీఎస్‌ విజయానంద్‌ (CS Vijayanand) ఆదేశాలు జారీ చేశారు. అభియోగాలపై నెలలోపు వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంజయ్‌ అధికార దుర్వినియోగంపై విచారణ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. రాజకీయ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించింది. వేర్వేరు అభియోగాలపై ఇప్పటికే సంజయ్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే

Next Story