- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిర్చి రైతులను ఆదుకోండి.. కేంద్రమంత్రికి చంద్రబాబు లేఖ
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాశారు.

దిశ డైనమిక్ బ్యూరో : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాశారు. మిర్చి రేటు ఆదుకునేలా చర్యలు చేపట్టాలని ఈ లేఖలో సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని కోరారు. సాగు వ్యయానికి, రైతుల అమ్ముకునే ధరకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలన్నారు. 50% నిష్పత్తిలో కాకుండా 100% నష్టాన్ని కేంద్రం భరాయించాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులు కేంద్రం ఆదుకోవాలని ఆయన కోరారు.మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతుల వద్ద నుంచి వెంటనే మిర్చిని కొనుగోలు చేయాలని కోరారు. మిర్చి రైతుల పరిస్థితి, మార్కెట్‌లో ధరల పతనంపై ఈ నెల14 వ తేదీన ఢిల్లీలో జరిగిన సమావేశం వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను కూడా సమర్పించిందని గుర్తు చేశారు. గడిచిన పది ఏళ్లుగా మిర్చి ఉత్పత్తి, ధరలపై వివరాలను ఆయన ఈ లేఖ ద్వారా సమర్పించారు. కొన్నేళ్ల నుంచి మిర్చిసాగు విస్తీర్ణం, దిగుబడి కూడా బాగా పెరిగిందని తెలిపారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా ఉత్పత్తి అధికంగా ఉందని అన్నారు. సాధారణ మిర్చి క్వింటాలకు రూ.11 వేలు, ప్రత్యేక వెరైటీ మిర్చి క్వింటాలు రూ.13 వేలకు పడిపోయిందన్నారు. ఆ ధర గతంలో 20000 ఉండేదని తెలిపారు. విదేశాలకు మిర్చి ఎగుమతి తగ్గిపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడిందని సీఎం వివరించారు. ధరలు పూర్తిగా తగ్గిపోవడంతో అన్నదాతలు ఆర్థిక కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారని సీఎం తెలిపారు. వెంటనే రైతుల ఆదుకోవాలని చంద్రబాబు లేఖలో కోరారు.






