- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఓటు తొలగింపు.. కారణం ఇదే!
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ(Graduate MLC) ఎన్నికల నోటిఫికేషన్(Election Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ(Graduate MLC) ఎన్నికల నోటిఫికేషన్(Election Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సంఘం(State Election Commission) ఈ ఎన్నికలను ఈ నెల(ఫిబ్రవరి) 27వ తేదీన నిర్వహించనుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. అయితే ఇప్పటికే నామినేషన్లు(Nominations) స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
ఇదిలా ఉంటే.. గుంటూరు(Guntur) పట్టణ పరిధిలో ప్రముఖ సినీ హీరో సూపర్ స్టార్(Superstar) మహేష్ బాబు(Mahesh Babu) పేరుతో ఓటరు జాబితా(Voter List)లో ఓటు నమోదు(Vote registration) కావడంతో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. శాసన మండలి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితాలో ప్రముఖ సినీ హీరో ఘట్టమనేని మహేశ్‌బాబు పేరుతో నమోదైన ఓటును తొలగించినట్లు గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, AERO చల్లా ఓబులేసు తెలిపారు. ఒక దినపత్రికలో కథనానికి ఆయన స్పందించారు. మహేష్ బాబు పేరుతో ఓటు తప్పుగా నమోదైందని, ఫారం-7 విచారణ అనంతరం ఓటును తొలగించామని వివరించారు.
అయితే.. డోర్ నెంబర్ 31-22-1639, విద్యార్హత బీకాం, డేట్ అఫ్ బర్త్ 1975 ఆగస్టు 9వ తేదీన వివరాలతో బూత్ నంబర్ 2014 వరుస సంఖ్య 1179 తో మహేష్ బాబు ఫొటో అప్లోడ్ చేసినట్లు జాబితాలో ఉంది. నిజానికి మహేష్ బాబు హైదరాబాద్(Hyderabad) జూబిలీ హిల్స్(Jubilee Hills)లో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలం అక్కడే ఆయన ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.






