- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్డీయే కూటమికి రైతే రాజు: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
కూటమి ఆధ్వర్యంలో సూపర్ సిక్స్... సూపర్ హిట్ సభను అనంతపురంలో నిర్వహించారు...

దిశ, వెబ్ డెస్క్: కూటమి ఆధ్వర్యంలో సూపర్ సిక్స్... సూపర్ హిట్ సభ(Super Six.. Super Hit Sabha)ను అనంతపురం(Ananthapur)లో నిర్వహించారు. ఈ సభలో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy Cm Pawan Kalyan), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్(Bjp State Chief Madhav) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చామని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం సంక్షేమం అందిస్తున్నామని, రాజకీయాల కోసం కాదని చెప్పారు. నేపాల్‌లో ఉన్న తెలుగువాళ్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎన్డీయే కూటమికి రైతే రాజు అని చెప్పారు. రైతులకు అండగా నిలబడేందుకే అన్నదాత సుఖీభవ అందిస్తున్నామన్నారు. రైతులకు యూరియా కొరత రాకుండా చూస్తామని, ఆ బాధ్యత తనదని తెలిపారు. తాను అడగగానే 7 రేక్‌ల యూరియా పంపుతామని కేంద్రం తెలిపిందని చంద్రబాబు పేర్కొన్నారు.
జెట్ స్పీడ్ లో ఫ్రీ బస్సు స్కీమ్ దూసుకెళ్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ 5 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేశారన్నారు. తల్లికి వందనంలో పరిమితులు పెట్టలేదని, ఎంత పిల్లలున్నా రూ. 15 వేలు అందిస్తున్నామన్నారు. సూపర్ సిక్స్ పథకాలపై వైసీపీ నాయకులు సెటైర్లు వేస్తున్నారని మండిపడ్డారు. దీపం పథకం ద్వారా ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తున్నాం. ఈ పథకంపై ఇప్పటికే రూ. 1700 కోట్లు ఖర్చు పెట్టాం. నైపుణ్య శిక్షణ ద్వారా లక్ష మంది యువతీయువకులను ఉద్యోగాలు కల్పించాం. ఏడాదిలో రాష్ట్రానికి రూ. 10 వేల కోట్ల విలువైన పెట్టుబడులు తీసుకొచ్చాం.’’ అని చంద్రబాబు తెలిపారు.






