- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
viveka Case: నాంపల్లి కోర్టులో సునీల్ యాదవ్ కౌంటర్ దాఖలు
by Vemula.Srinu Prasad |
వివేకానందారెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ నాంపల్లిలో కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు..

X
దిశ, వెబ్ డెస్క్: వివేకానందారెడ్డి హత్య కేసు(Vivekanandareddy Murder Case) నిందితుడు సునీల్ యాదవ్(Sunil Yadav) నాంపల్లి(Nampally)లో కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. కడప జైలు(Kadap Jail)లో దస్తగిరిని డాక్టర్ చైతన్య బెదిరించిన ఘటనపై సీబీఐ(Cbi) ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్రశ్నించారు. అలాగే 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి వెనుక అవినాశ్ రెడ్డి కుట్ర కోణాన్ని ఇప్పటివరకూ ఎందుకు తేల్చలేదన్నారు. ఆరుగురు సాక్షులు మృతి చెందడంపై సీబీఐ దర్యాప్తు ఎక్కడ వరకు వచ్చిందన్నారు. కల్లూరు గంగాధర్ రెడ్డి అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారని, కానీ ఎందుకు రక్షించలేకపోయారని ప్రశ్నించారు. మిగిలిన నిందితులు దర్యాప్తు వద్దని ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని సునీల్ యాదవ్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
Next Story






