రాజీనామా చేసి రాజకీయాలు చేసుకోవచ్చు.. సునీల్ కుమార్ వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్ ఫైర్

by Malleboina Mahesh |

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ. సునీల్ కుమార్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి.

రాజీనామా చేసి రాజకీయాలు చేసుకోవచ్చు.. సునీల్ కుమార్ వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ (Sunil Kumar) చేసిన రాజకీయ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఆయన ఓ సమావేశంలో పాల్గొని.. కాపులకు సీఎం పదవి, దళితులకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు (Raghuramakrishna Raju) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఆయన సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడారని రఘురామకృష్ణ రాజు విమర్శించారు. ఒక ఉన్నత స్థాయిలో పనిచేసిన అధికారి పదవిలో లేకపోయినా, ప్రభుత్వ సర్వీస్‌కు సంబంధించిన నిబంధనలు పాటించాలని ఆయన హితవు పలికారు.

ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. రఘురామకృష్ణ రాజు ఈ సందర్భంగా, "ఆయనకు రాజకీయాలు చేయాలని ఉంటే, ముందుగా తన పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత రాజకీయాలు చేసుకోవచ్చని. సర్వీస్‌లో ఉండి, నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏ మాత్రం సరికాదు," అని స్పష్టం చేశారు. "ఇలాంటి వారిని ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోంది?" అని రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు. మాజీ అధికారిపై తక్షణం యాక్షన్ తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సునీల్ కుమార్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ చేసిన ఈ ప్రకటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story