నిప్పుల కొలిమిలా ఏపీ.. ఈ జిల్లాల్లో బెంబేలెత్తిస్తున్న ఎండ తీవ్రత

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ..

నిప్పుల కొలిమిలా ఏపీ.. ఈ జిల్లాల్లో బెంబేలెత్తిస్తున్న ఎండ తీవ్రత
X

దిశ,వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా భానుడు(Sun) తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాయలసీమ(Rayalaseema), కోస్తా(Kosta) తీర ప్రాంతాల్లో భానుడి భగభగలు తీవ్ర రూపం దాల్చాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటిపోయి నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా కొప్పెరపాడు(Kopperapadu)లో శుక్రవారం అత్యధికంగా 43.8°C ఉష్ణోగ్రత నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 42.7°C, పల్నాడు జిల్లా గండిగనుమలలో 42.6°C లెక్కిస్తూ ఎండలు దంచికొడుతున్నాయి.

ఆ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి

మిగిలిన జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కర్నూలు జిల్లా నగరడోనలో 42.2°C, కృష్ణా జిల్లా ఉయ్యూరులో 42.1°C మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని వాతావరణ శాఖ నిపుణులు సూచించారు.

Next Story