- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో భానుడు భగభగ.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
ఏపీలో భనుడు భగభగ మండిపోతున్నాడు. ఉదయం నుంచే విరుచుకుపడుతున్నారు. మధ్యాహ్నం అయితే చాలు మాడు సుర్రుమనిపించేస్తున్నారు. ...

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో భనుడు భగభగ మండిపోతున్నాడు. ఉదయం నుంచే విరుచుకుపడుతున్నారు. మధ్యాహ్నం అయితే చాలు మాడు సుర్రుమనిపించేస్తున్నారు. దీనికి తోడూ ఉక్కపోత ఉడికించేస్తోంది. దీంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకిపోతున్నారు. ఇన్ని రోజులు చల్లాగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కేసింది. నడి వేసవిలో నమోదు కావాల్సిన ఉష్ట్రోగతలు మార్చి మొదటి వారంలోనే నమోదు అవుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ ఈ స్థాయి నమోదు కాలేదు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో పలుచోట్ల 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో ఏప్రిల్, మే నెలలో ఏ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయోనన్న ఆందోళన జనాల్లో కనిపిస్తోంది.
రాష్ట్రంలో తాజా ఉష్ణోగ్రతలు
ఇక రాష్ట్రంలో ఆదివారం అత్యధికంగా నంద్యాలలో 41.59 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. పార్వతీపురం మన్యంలో 41, తిరుపతిలో 40, కర్నూలులో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు స్పష్టం చేశారు.






