- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tragedy: వారణాశిలో విషాదం.. ఏపీకి చెందిన అన్నదమ్ముల ఆత్మహత్య
వారణాశిలో విషాదం చోటు చేసుకుంది..

దిశ, వెబ్ డెస్క్: వారణాశిలో విషాదం చోటు చేసుకుంది. ఏపీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు. వారణాశిలో అద్దెకు తీసుకున్న ఆశ్రమంలోనే ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన లక్ష్మీనారాయణ, వినోద్.. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం చేశారు. అయితే ఇద్దరు అన్నదమ్ములు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఏప్రిల్ నెలలో ఉంగుటూరు నుంచి వెళ్లిపోయారు. ఈ మేరకు చేబ్రోలు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు అయింది.
ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ వారణాశిలో ఉంటున్నారు. అయితే నలుగురు వ్యక్తులు ఫోన్ చేసి తమను బెదిరిస్తున్నారంటూ, అందుకే తాము ఆత్మహత్మ చేసుకుంటున్నామని సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి బంధువులు పంపారు. అనంతరం ఆశ్రమంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆధార్, పాన్ కార్డు ఆధారంగా పోలీసులు లక్ష్మీనారాయణ బంధువులకు సమాచారం అందించారు. దీంతో అన్నదమ్ముల అంత్యక్రియలను బంధువులు వారణాశిలోనే నిర్వహించారు.






