టీడీపీకి బిగ్ షాక్... సీనియర్ నేత రాజీనామా

by Ajay Maddhiboyina |

అధికార పార్టీ టీడీపీకి అన్నమయ్య జిల్లాలో బిగ్ షాక్ తగిలింది. 2024 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయిన

టీడీపీకి బిగ్ షాక్... సీనియర్ నేత రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్: అధికార పార్టీ టీడీపీకి అన్నమయ్య జిల్లాలో బిగ్ షాక్ తగిలింది. 2024 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రమణ్యం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతలే తనను ఓడించారని బాల సుబ్రమణ్యం సంచలన ఆరోపణలు చేశారు. తమకు పార్టీ ముఖ్యం కాదని, కార్యకర్తలే ముఖ్యం అని బాలసుబ్రమణ్యం సోదరుడు ప్రసాద్ బాబు అన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాయచోటి నుండి పోటీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇప్పుడు రాజీకీయంగా ఎదురుదెబ్బ తగలి ఉండొచ్చు కానీ ప్రజలే తమ ధైర్యం అని మళ్లీ పోటీ చేసి ప్రజాసేవ చేస్తామని చెప్పారు. ఏ పార్టీ మద్దతు ఉన్నా లేకున్నా పోటీ చేస్తామని అన్నారు. బాలసుబ్రమణ్యం తన తండ్రి సుగవాసి పాలకొండ్రాయుడు వారుసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. పాలకొండ్రాయుడు టీడీపీ నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా మరియు ఒకసారి ఎంపీగా పోటీ చేసి గెలిచారు.

Next Story