ప్రత్తిపాడులో పెనుగాలుల బీభత్సం: రోడ్లపై విరిగిపడ్డ భారీ వృక్షాలు

by Vemula.Srinu Prasad |

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో అకస్మాత్తుగా ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈ గాలుల ధాటికి పలుచోట్ల భారీ వృక్షాలు వేళ్లతో సహా పెకలించుకుపోయి రోడ్లపై పడిపోయాయి. ..

ప్రత్తిపాడులో పెనుగాలుల బీభత్సం: రోడ్లపై విరిగిపడ్డ భారీ వృక్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా(Guntur District) ప్రత్తిపాడు(Prattipadu) నియోజకవర్గంలో అకస్మాత్తుగా ఈదురుగాలులు(Gusts) బీభత్సం సృష్టించాయి. ఈ గాలుల ధాటికి పలుచోట్ల భారీ వృక్షాలు వేళ్లతో సహా పెకలించుకుపోయి రోడ్లపై పడిపోయాయి. ఈ మేరకు వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రోడ్డుకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ట్రాఫిక్ పరిస్థితిని తెలుసుకున్న మున్సిపల్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ తీగలపై కొమ్మలు విరిగిపడటంతో ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ రంపాల సాయంతో చెట్లను తొలగించారు. అనంతరం రహదారిని పునరుద్ధరించారు. ఎవరికీ ప్రాణనష్టం కలగకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

Next Story