- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ హాస్టల్‌లో 17 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
గుంటూరు జిల్లా అన్నపర్రులో బీసీ బాలుర హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు..

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు(Government Hostel Students) అనారోగ్య పాలవుతున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో ఏదో ఒక చోట విద్యార్థులు తరచూ అస్వస్థత(Illness)కు గురవుతున్నారు. ప్రభుత్వం అప్రమత్తమై అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. దీంతో ప్రభుత్వ తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ హాస్టల్‌లో దారుణ పరిస్థితులు ఉంటున్నాయని ప్రభుత్వ యంత్రంగా ఏం చేస్తోందనే ప్రశ్నలు కొనసాగుతున్నాయి.
తాజాగా జరిగిన ఈ ఘటన సైతం ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తోంది. గుంటూరు జిల్లా అన్నపర్రు(Annaparru)లో బీసీ బాలుర హాస్టల్ విద్యార్థులు(BC Boys Hostel students) ఈ రోజు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్‌లో 17 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. దీంతో విద్యార్థులను సమీపంలోని పీహెచ్‌సీ(Phc)కి తరలించారు. వారందరికి చికిత్స అందిస్తున్నారు. అయితే హాస్టల్‌లో మరికొందరు విద్యార్థులు జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. హాస్టల్‌లో వసతి సౌకర్యంతో పాటు మంచి నీటి సరఫరా సరిగాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర లేచి ప్రభుత్వ హాస్టల్‌లో పరిస్థితులపై దృష్టి పెట్టాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సూచిస్తున్నారు.






