- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. అన్నం తిన్న కొద్దిసేపటికే ఆస్పత్రి పాలైన విద్యార్థులు
జడ్పీ హైస్కూలులో భోజనం వికటించి విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు..

దిశ, వెబ్ డెస్క్: జడ్పీ హైస్కూలులో మధ్యాహ్నం భోజనం వికటించి విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలి గౌరీదేవిపేటలో జరిగింది. పాఠశాలలో విద్యార్థులు రోజు మాదిరిగా మధ్యాహ్న భోజనం తిన్నారు. తిన్న కాసేపటికే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థులను స్థానిక ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. అన్నం సరిగా ఉడకలేదని విద్యార్థులు చెబుతున్నారు.
మరోవైపు విషయం తెలియడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల వద్దకు కొందరు చేరుకుని తమ విద్యార్థుల పరిస్థితి తెలుసుకున్నారు. ఎలాంటి ప్రమాదం లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్న భోజనం విషయంలో పాఠశాల యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు పెట్టే అన్నాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.






