Big Alert: విద్యార్థులకు అలర్ట్.. ఆ ప్రవేశ పరీక్ష తేదీ మార్పు.. మళ్లీ ఎప్పుడంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-10 11:54:51  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా 164 మోడల్ స్కూల్స్‌లో 2025-26 సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.

Big Alert: విద్యార్థులకు అలర్ట్.. ఆ ప్రవేశ పరీక్ష తేదీ మార్పు.. మళ్లీ ఎప్పుడంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా 164 మోడల్ స్కూల్స్‌లో 2025-26 సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యాశాఖ ప్రవేశ పరీక్ష(Entrance Exam) తేదీని కూడా ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల(ఏప్రిల్) 20న పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రం(Andhra Pradesh)లోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించనున్న పరీక్ష తేదీని మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ రోజు(ఏప్రిల్ 20) ఈస్టర్ పర్వదినం కావడంతో పరీక్షను మరుసటి రోజు (ఏప్రిల్ 21)కి రీ షెడ్యూల్ చేశారు.

ఈ విషయాన్ని విద్యార్థులు(Students), తల్లిదండ్రులు(Parents) గమనించాలని విద్యాశాఖ(Education) సూచించింది. ఈ తరుణంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏ మండలంలో మోడల్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ మార్పు చేసిన తేదీ ప్రకారం ఈ నెల 21వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించే పరీక్షకు హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://cse.ap.gov.in/ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది.

Next Story