నటుడు మోహన్‌ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ! విద్యార్థి సంఘాల ఆందోళన

by Ramesh Naini |

సినీ నటుడు మోహన్ బాబు‌ యూనివర్సిటీలో విద్యార్థులు కిడ్నాప్ అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నటుడు మోహన్‌ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ! విద్యార్థి సంఘాల ఆందోళన
X

దిశ, డైనమిక్ బ్యూరో: సినీ నటుడు మోహన్ బాబు‌ యూనివర్సిటీలో విద్యార్థులు కిడ్నాప్ అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల కిడ్నాప్ ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ క్రమంలోనే మంగళవారం విశాఖపట్నంలోని ఆంధ్ర వర్సిటీలో విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వర్సిటీ ముందు మోహన్ బాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నటుడు మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఫీజుల దోపిడీని ప్రశ్నించినందుకు విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేసినట్లు ఆరోపించారు. ​జీవో నెంబర్ 33 ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలని, అదనపు వసూళ్లను అరికట్టాలని నినాదాలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

Next Story