- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భోగాపురం ఎయిర్ పోర్టు పనులు ఆపండి: బీజేపీ ఎమ్మెల్యే సంచలన డిమాండ్
రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) కొరతపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు(Bjp Mla Vishnu Kumar Raju) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన సంక్షోభం ప్రజలను అతలాకుతలం చేస్తోందని, దీనికి పరిష్కారం లభించే వరకూ ప్రతిష్టాత్మక భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఇబ్బందులను తీర్చడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత కావాలని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. ఇంధన డిమాండ్‌ను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. కాలుష్యాన్ని, ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు డీజిల్ బస్సుల స్థానంలో వెంటనే ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తీసుకురావాలన్నారు. అలాగే, విశాఖపట్నం ఎయిర్‌పోర్టును యథాతథంగా కొనసాగించాలని, విమాన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని విష్ణుకుమార్ రాజు కోరారు.
ఈ సంక్షోభానికి అదే పరిష్కారం
ప్రజా రవాణాను బలోపేతం చేయడమే ఈ సంక్షోభానికి సరైన పరిష్కారమని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి రైళ్ల సర్వీసులను భారీగా పెంచాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా విశాఖ నుంచి విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, చెన్నై వంటి కీలక నగరాలకు కొత్తగా వందేభారత్ రైళ్లను వెంటనే ప్రవేశపెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విష్ణుకుమార్ రాజు విజ్ఞప్తి చేశారు.






