ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి : ఏపీ డిప్యూటీ సీఎం

by Thanuru Gopichand |

హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద బైక్ ను ఢీకొని మంటలు చెలరేగడంతో బస్ దగ్ధమైంది.

ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి : ఏపీ డిప్యూటీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద బైక్ ను ఢీకొని మంటలు చెలరేగడంతో బస్ దగ్ధమైంది. ఈ ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఘటనలో ఇప్పటికే 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరంగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం తరపున సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలుగా భద్రతా ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపట్టాలని రవాణా శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Next Story