బ్రేకింగ్.. విజయనగరం సిరిమానోత్సవంలో తొక్కిసలాట

by Naga Rani Yarlagadda |

విజయనగరం సిరిమానోత్సవంలో తొక్కిసలాట జరిగింది. ఆర్డీఓ దాట్ల కీర్తి కారులో రావడంతో జరిగిన తోపులాట కారణంగా ఈ ఘటన జరిగింది.

బ్రేకింగ్.. విజయనగరం సిరిమానోత్సవంలో తొక్కిసలాట
X

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద జరుగుతున్న సిరిమానోత్సవంలో తొక్కిసలాట జరిగింది. సిరిమాను ఉత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలి రాగా.. ఆ సమయంలో ఆర్డీఓ దాట్ల కీర్తి కారులో వచ్చింది. దీంతో భక్తుల మధ్య తోపులాట జరిగి.. తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళకు తీవ్రగాయాలు కావడంతో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. భక్తుల రద్దీ మధ్యలోకి కారుతో వచ్చిన ఆర్డీఓ కీర్తిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం చూపించాల్సిన సమయం ఇది కాదని, తొక్కిసలాటకు కారణమైన ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story