- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
18న తిరుపతికి డిప్యూటీ సీఎం పవన్.. గోశాల పరిశీలన
రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ నెల 18న తిరుపతి వెళ్లనున్నారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) ఈ నెల 18న తిరుపతి(Tirupati) వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారి(Tirumala Srivari)ని ఆయన దర్శించుకోనున్నారు. అనంతరం టీటీడీ గోశాల(TTD Cowshed)ను పరిశీలించనున్నారు. గోవులు మృతి చెందుతున్నాయన్న ప్రచారంతో గోశాలను పరిశీలించాలని భావించారు. ఈ మేరకు గోశాలకు వెళ్లి గోవుల మృతి అంశంపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. గోవుల సౌకర్యాలపై పలు సూచనలు చేయనున్నారు. తిరుపతి, తిరుమల(Tirupati, Tirumala) అభివృద్ధిపై అధికారులతో చర్చించనున్నారు.
కాగా తిరుపతి గోశాలలో గోవులు మృతి చెందాయంటూ ప్రచారం చెలరేగింది. దీంతో వైసీపీ, కూటమి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి స్థానిక టీడీపీ నేతలు సవాల్ విసిరారు. దీంతో తాను గురువారం గోశాలను పరిశీలిస్తామని చెప్పారు. ఆ మరుసటి రోజు శుక్రవారం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతిలో పర్యటిస్తుండటంతో ఇప్పటి నుంచి అక్కడ టెన్షన్ వాతావరణ కొనసాగుతోంది.






