- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహనీయుల నేలకు నేనొచ్చా: పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
మహనీయుల నేలకు తానొచ్చానని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు..

దిశ, వెబ్ డెస్క్: మహనీయుల నేలకు తానొచ్చానని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) వ్యాఖ్యానించారు. కడప మున్సిపల్ స్కూలు(Kadapa Municipal School)లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రాయలసీమ(Rayalaseema) నేలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదువుల నేల రాయలసీమకు అని, అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాతమని ఆయన పేర్కొన్నారు. రాయలసీమలో అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణ చార్యులు వంటి మహనీయులు పుట్టారని, అలాంటి ప్రాంతం అభివృద్ధి వెనకబాటుకాదని చెప్పారు. అవకాశాలకు ముందుండి నడిచే ప్రాంతం రాయలసీమ కావాలని పవన్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu), మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) రాయలసీమ ప్రాంతం వారు కావడంతో సమస్యలు తీరిపోయి ఉంటాయని అనుకున్నానని, కానీ కడప(Kadapa)లో నీటి సమస్య తీవ్రంగా ఉందని తాను అసలు అనుకోలేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.






