సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన.. ముహూర్తం ఫిక్స్

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు...

సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన.. ముహూర్తం ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu Naidu) విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. పెట్టుబడులే లక్ష్యంలో ఈ పర్యటన చేయనున్నారు. ఈ మేరకు ముహుర్తం కూడా ఫిక్స్ చేశారు. ఇప్పటికే షెడ్యూల్ వివరాలు కూడా విడుదలయ్యాయి. ఈ నెల 22 నుంచి 24 వరకు సీఎం చంద్రబాబు విదేశాల్లో పర్యటించనున్నట్లు అధికారులు సైతం ధృవీకరించారు. దుబాయ్‌, అబుదాబి, యూఏఈలో సీఎం పర్యటన ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు వెంట మంత్రులు టీజీ భరత్‌, బీసీ జనార్ధన్‌రెడ్డితో పాటు పలువురు అధికారులు వెళ్లనున్నట్లు వెల్లడించారు. నవంబర్‌ 14, 15 తేదీల్లో విశాఖ(Visakha)లో జరిగే సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌కు పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు సీఎం విదేశీ పర్యటన చేస్తున్నట్లు తెలిపారు. స్థిరాస్తి, భవన నిర్మాణం, లాజిస్టిక్స్‌, రవాణా, ఫైనాన్స్‌, సర్వీసెస్‌, ఇన్నోవేషన్స్‌ రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానించనున్నారని అధికారులు పేర్కొన్నారు.

Next Story