వైసీపీ ఎన్నికల ప్రచారంలా రాష్ట్ర బడ్జెట్.. మాజీ జేడీ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 5 |
వైసీపీ ఎన్నికల ప్రచారంలా రాష్ట్ర బడ్జెట్.. మాజీ జేడీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వైసీపీ ఎన్నికల ప్రచారంలా ఉందని జై భారత్ పార్టీ అధినేత జేడీ లక్ష్మీ నారయణ ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ అసెంబ్లీలో ఆమోదించిన బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ లా లేదని, వైసీపీ ప్రచారం కోసం ప్రవేశపెట్టిన దానిలా ఉందని మండిపడ్డారు. రూ. 4.25 లక్షల కోట్ల నగదు బదీలి జరిపి పేదరికం తొలగించామని ఆర్ధిక మంత్రి చెప్పడం హాస్యాస్పధంగా ఉందన్నారు.

అప్పులు చేసి డబ్బు పంచితే, అది పేదరిక నిర్మూలన కిందకి ఎలా వస్తుందని ఎద్దేవా చేశారు. 43 లక్షల మంది విద్యార్ధులకు గోరుముద్ద, 35 లక్షల మంది విద్యార్ధులకు సంపూర్ణ పోషణ అని చెప్పిన లెక్కల్లో వాస్తవమెంతొ చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో అంత అభివృద్ది జరిగితే తెల్ల రేషన్ కార్డుల సంఖ్య ఎందుకు తగ్గట్లేదని, యువత్ ఉపాధి కోసం వలస పోతున్నది నిజం కాదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతేగాక ఎన్నికల ముందు ప్రభుత్వం హడావిడి చేస్తో్ందని, టీచర్ పోస్టుల భర్తీకి ఇప్పుడే సమయం దొరికిందా అని జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. అభివృద్ది జరిగిందని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం రోడ్లు కూడా వేయలేదని అన్నారు.

Next Story

Most Viewed