కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట.. స్పాట్‌లోనే 9 మంది దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-01 07:13:36  IST  )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట.. స్పాట్‌లోనే 9 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో ఇవాళ మధ్యాహ్నం భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఝటనలో మొత్తం ఇప్పటి వరకు 9 మంది దుర్మరణం పాలైనట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. నేడు కార్తీక ఏకాదశి (Kartik Ekadashi) కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు స్థానికులతో పాటు పక్క జిల్లాల నుంచి భక్తులు భారీ ఎత్తున ఆలయానికి పోటెత్తారు. కానీ, నిర్వాహకులు అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఆలయ ప్రాంగణంలో ఉన్న రెయిలింగ్ కూలి తొక్కిసలాట చోటుచేసుకున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే, అప్రమత్తమైన పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Next Story