- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Srivari Temple : శ్రీవారి ఆలయ పైకప్పు మరమ్మతులు షురు !
తిరుమల శ్రీవారి ఆలయం(Tirumala Srivari Temple) పైకప్పు మరమ్మతులు(Roof Repairs Begins) ప్రారంభమయ్యాయి. టీటీడీ పాలకమండలి తీర్మానం మేరకు చైర్మన్ బీఆర్ నాయుడు(Chairman BR Naidu)అదేశానుసారం మరమ్మతు పనులు ప్రారంభించారు.

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారి ఆలయం(Tirumala Srivari Temple) పైకప్పు మరమ్మతులు(Roof Repairs Begins) ప్రారంభమయ్యాయి. టీటీడీ పాలకమండలి తీర్మానం మేరకు చైర్మన్ బీఆర్ నాయుడు(Chairman BR Naidu)అదేశానుసారం మరమ్మతు పనులు ప్రారంభించారు. తిరుమల ఆలయంలో మూలమూర్తి కొలువైన గర్భాలయం తో పాటు ఆలయ ప్రాకారంలోని పలు మండపాలు, ఉప ఆలయాలు...లడ్డూలు, అన్నప్రసాదాలు తయారు చేసే పోటులు నిర్మాణం జరిగి వేల సంవత్సరాలు కావడంతో వాటి పైకప్పులో చాలా ప్రాంతాల్లో పగుళ్లు ఏర్పడ్డాయి.
వర్షం కురిసినప్పుడు నీరు లోనికి ప్రవేశిస్తోంది. ప్రధానంగా పోటులో వర్షపు నీరు లీకేజీ వల్ల ప్రసాదాల తయారీలో ఏర్పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా గతేడాది నవంబరు 18వ తేదీన జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ సమస్యపై చర్చించి చైర్మన్ బీఆర్ నాయుడు మరమ్మతులకు తీర్మానం చేశారు. లీకేజీల నివారణ పనుల నిర్వహణకు అనుభవం కలిగిన టీవీఎస్ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ పనులన్నీ ఉచిత సర్వీస్ కింద చేసేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ఆ సంస్థకు చెందిన సిబ్బంది లీకేజీ నివారణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం పగుళ్లను గుర్తించి పూడ్చడంతో పాటు పెయింటింగ్ వేస్తున్నారు. మార్చి31వ తేదీన నాటికి మొత్తం లీకేజీలను నివారించేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు.
ఇది ఇలాఉండగా..కల్తీ నెయ్యి కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై తిరుపతి 2వ ఏడీఎం కోర్టు న్యాయూర్తి తీర్పు రిజర్వు చేశారు. నిందితుల తరపున సుప్రీంకోర్టు న్యాయ వాది వాణి వాదనలు వినిపించగా సిట్ తరపున ఏపీపీ జయశేఖర్ వాదించారు. సుదీర్ఘంగా సాగిన వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేశారు. వచ్చే సోమవారం లేదా మంగళ వారం తీర్పు వెలువరించే అవకాశముంది.
అటు తిరుపతిలో జనవరి 8వ తేదీన వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్ల జారీలో జరిగిన తొక్కిసలాట..ఆరుగురి మృతి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేసిన విచారణ కమిటీ రెండో దశ విచారణ శుక్రవారం నుంచి ప్రారంభించింది. తొక్కిసలాట బాధిత కుటుంబాలను, పద్మావతి పార్కు పరిసరాల దుకాణాల వారితో పాటు మొత్తం 70మందిని విచారించనున్నారు. ఈ మేరకు వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.






