- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala)లో మంగళవారం శ్రీవారి బ్రహ్మోత్సవాల (Srivari Brahmotsavalu)కు అంకురార్పణ జరిగిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala)లో మంగళవారం శ్రీవారి బ్రహ్మోత్సవాల (Srivari Brahmotsavalu)కు అంకురార్పణ జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం 5.43 నుంచి 6:15 మధ్య మీనలగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ.. ధ్వజారోహణ (Flag Hoisting) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం ధ్వజపటాన్ని ఎగురవేయడంతో ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ధ్వజారోహణంలో వినియోగించేందుకు విష్ణు దర్బతో తయారు చేసిన 7 మీ. పొడవు, 2 మీటర్ల వెడల్పుతో చాప, 211 అడుగుల పొడవు తాడును సిద్ధం చేసి ఆలయానికి తరలించారు.
బ్రహ్మోత్సవాల్లో రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనం (Pedda Sesha Vahanam)తో వాహన సేవలు ఆరంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి ధర్మకర్తల మండలి హయంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. నేటి నుంచి ప్రారంభం కాబోయే అక్టోబర్ 2 వరకు అంటే విజయదశమి (Vijaya Dashami) వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఈ సందర్భంగా భక్తులకు 16 రకాల వంటకాలు పంపిణీ చేయనున్నట్లుగా టీటీడీ (TTD) వెల్లడించింది. ఇవాళ సతీసమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు దంపుతులు తిరుమలకు రానున్నారు. అనంతరం రాత్రి పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు.






