శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

by Jakkula.Mamatha |

గత కొన్ని రోజులుగా ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
X

దిశ,వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం నీటి మట్టం రోజురోజుకూ పెరుగుతుండటంతో సంగమేశ్వరాలయం శిఖరాగ్రానికి చేరువలో ఉంది. వరద ఇలాగే కొనసాగితే మరో రెండు రోజుల్లో సంగమేశ్వరాలయం జలాధివాసం కానుంది. ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 856.10 అడుగులు గా నమోదైంది.

జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం రిజర్వాయరుకు ఇన్‌ఫ్లో 36,050 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. ఇదిలా ఉంటే.. శ్రీశైలం జలాశయం నీటిమట్టం నిన్న(ఆదివారం) సాయంత్రం 6 గంటల సమయానికి 855.20 అడుగులుగా ఉంది. నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, 92.4867 టీఎంసీలుగా టీఎంసీలుగా నమోదైంది. అయితే.. ప్రతి ఏటా జూన్ తర్వాత శ్రీశైలంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కానీ ఈ ఏడాది మాత్రం మే నెల నుంచే వరద కొనసాగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో ఎగుం ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు అంచనా. ఈ క్రమంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు.

Next Story