సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ ఆదాయం

by Ramesh Naini |

ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఆలయానికి వరుస సెలవుల ప్రభావంతో భారీగా ఆదాయం లభించింది.

సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ ఆదాయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఆలయానికి వరుస సెలవుల ప్రభావంతో భారీగా ఆదాయం లభించింది. సెలవులు కావడంతో క్షేత్ర దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిన్న ఒక్కరోజే సుమారు 40 వేల మంది భక్తులు మల్లన్నను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.

భక్తుల రద్దీతో ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ దర్శనాలు, మనమిత్ర సేవలు, లడ్డూ ప్రసాదాల విక్రయం, ఆర్జిత సేవలు, కేశఖండనతో పాటు ఇతర సేవల ద్వారా నిన్న ఒక్కరోజే ఆలయానికి రూ.1 కోటి 46 లక్షల 94 వేల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి హుండీలను దేవస్థానం అధికారులు లెక్కించారు. కాగా, భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనాలు సజావుగా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవస్థానం వర్గాలు వెల్లడించాయి.

Next Story