వైసీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన శ్రీశైలం దేవస్థానం.. కాటేజీలు స్వాధీనం

by Naga Rani Yarlagadda |

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి నుంచి శ్రీశైలం దేవస్థానం బోర్డు కాటేజీలను స్వాధీనం చేసుకుంది.

వైసీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన శ్రీశైలం దేవస్థానం.. కాటేజీలు స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శి వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డికి శ్రీశైలం దేవస్థానం షాకిచ్చింది. దేవస్థానానికి చెందిన కాటేజీని అప్పగించకుండా మూడేళ్లుగా వాడుకుంటున్న ఆయనకు ఇటీవలే నోటీసులు జారీ చేసింది. కాటేజీని తిరిగి అప్పగించాలని ఇప్పటికే మూడుసార్లు నోటీసులిచ్చిన ఆయన నుంచి స్పందన లేకపోవడంతో.. దేవస్థాన అధికారులు రంగంలోకి దిగారు. ఆయన అనధికారికంగా వాడుకుంటున్న బూచేపల్లి నిలయం కాటేజీని స్వాధీనం చేసుకున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. దానితోపాటు మరో 7 కాటేజీలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటనలో స్పష్టం చేశారు.

Next Story