- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. కలెక్టర్ రాజకుమారి కీలక ప్రకటన
మహా శివరాత్రి (Maha Shivratri) పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం (Srisailam)లోని కొలువుదీరిన శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: మహా శివరాత్రి (Maha Shivratri) పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం (Srisailam)లోని కొలువుదీరిన శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇప్పటికే చండీశ్వర పూజ, మండపారాధన, కలశార్చన, శివ పంచాక్షరీ, జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్ర హోమం, చండీహోమ కార్యక్రమాలు అట్టహాసంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి రోజూ సాయత్రం వివిధ వాహనాలపై ఊరేగిస్తున్నారు. మహా శివరాత్రి వేళ స్వామి వారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం ఉండటంతో మంగళవారం రాత్రి నుంచే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీశైల క్షేత్రానికి చేరుకున్నారు. భక్తుల తాకిడితో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. పాతాళగంగ (Paathala Ganga) స్నానఘట్టాల వద్ద భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈవో (EO), అధికారులు తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతించారు.
తాజా సమాచారం ప్రకారం ఇవాళ ఒక్కరోజే ఆలయానికి 1.30 లక్షల మంది వచ్చినట్లుగా తెలుస్తోంది. వారంతా కుప్పలుకుప్పలుగా స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి (Collector Rajkumari) కీలక ప్రకటన చేశారు. సాధారణ ప్రజల దర్శనానికి వీఐపీలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా పాగాలంకరణకు కేవలం 8 వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని అన్నారు. క్యూ లైన్లో వేచి ప్రతిఒక్కరికీ స్వామి వారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎవరూ సహనం కోల్పోవద్దని కలెక్టర్ రాజకుమారి సూచించారు. కాగా, ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవార్లకు ప్రభోత్సవం, అనంతరం నంది వాహన సేవను నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటల నుంచి మల్లన్న ఆలయానికి పాగాలంకరణ చేయనున్నారు. అర్ధరాత్రి వరకు శ్రీ మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం, అనంతరం బ్రహ్మోత్సవ కల్యాణ క్రతువు కొనసాగనుంది.






