- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతిలో శ్రీనివాస కళ్యాణం.. తేదీ ఖరారు!
తిరుమల(Tirumala)లో శ్రీవారి సాలికట్ల తెప్పోత్సవాలు మొదలయ్యాయి.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala)లో శ్రీవారి సాలికట్ల తెప్పోత్సవాలు మొదలయ్యాయి. నిన్నటి నుంచి వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగుతున్నాయి. మాడవీధుల్లో ఉత్సవ మూర్తుల ఊరేగింపు నిర్వహించారు. విద్యుత్ కాంతులతో, రంగురంగుల పుష్పాలంకరణతో శోభాయమానంగా ముస్తాబైన తెప్పపై సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులకు కనువిందు చేశారు.
ఉత్సవాల్లో భాగంగా, సాయంత్రం 6 గంటలకు శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు ఆలయ నాలుగు మాడ వీధుల గుండా సాగి పుష్కరిణికి చేరుకుంది. ఈ తెప్పోత్సవాల కారణంగా నేడు(సోమవారం), సహస్రదీపాలంకరణ సేవ, మార్చి 11, 12, 13 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవను రద్దు చేశారు.
ఇదిలా ఉండగా.. ఈ నెల 15వ తేదీన అమరావతి(Amaravati)లో తొలిసారి వైభవంగా శ్రీనివాస కల్యాణం కన్నుల పండుగగా నిర్వహించేందుకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అమరావతిలోని వేంకటపాలెంలో ఈ నెల 15వ తేదీన జరగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని, స్వామి వారి కళ్యాణాన్ని అందరూ చూసి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అమరావతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మొదటిసారి శ్రీనివాస కళ్యాణోత్సవం జరుగుతున్నందున భక్తులు అధికంగా తరలి రానున్నారు. దీంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తాగునీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు ఎల్ఈడీ స్కీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.






