విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తున్నాం : కేంద్రమంత్రి

by Thanuru Gopichand |

నారా లోకేష్ నాయకత్వంలో శ్రీకాకుళాన్ని (Srikakulam) విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తున్నామని కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Rammohan Naidu) అన్నారు.

విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తున్నాం : కేంద్రమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : నారా లోకేష్ నాయకత్వంలో శ్రీకాకుళాన్ని (Srikakulam) విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తున్నామని కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Rammohan Naidu) అన్నారు. శ్రీకాకుళంలోని మహిళా జూనియర్ కళాశాలలో ఇటీవల నూతనంగా 5 తరగతి గదులను నిర్మించారు. గదుల ప్రారంభోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెకట్ఱ్ స్వప్నిల్ దినకర్ కలిసి తరగతి గదులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ యువత భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అభివృద్ధిలో నూతన గదుల ప్రారంభం ఒక ముఖ్యమైన అడుగు అన్నారు. ప్రతి విద్యార్థికి మెరుగైన మౌలిక వసతులు, అవకాశాలు కల్పించడంతో పాటు కళాశాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో శ్రీకాకుళంను విద్యా కేంద్రంగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గదుల నిర్మాణానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద సహకారం అందించిన ఎన్పీసీఎల్ (NPCL)సంస్థకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Next Story