శ్రీకాకుళం జిల్లాలోని క్వారీలో భారీ బ్లాస్ట్.. ముగ్గురు కార్మికులు మృతి..!

by Ramesh Naini |   (  Updated:2025-10-07 14:45:51  IST  )

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. జంగాలపాడు సమీపంలోని ఓ క్వారీలో భారీ బ్లాస్ట్ సంభవించింది.

శ్రీకాకుళం జిల్లాలోని క్వారీలో భారీ బ్లాస్ట్.. ముగ్గురు కార్మికులు మృతి..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. జంగాలపాడు సమీపంలోని రాజయోగి గ్రానైట్ క్వారీలో భారీ బ్లాస్ట్ సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందినట్లు తెలిసింది. పలువురు గాయాలపాలయ్యారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు మొగల్, పింటు, శ్రవణ్‌గా సిబ్బంది గుర్తించారు. పిడుగు పడటంతో వారు చనిపోయారని క్వారీ నిర్వాహకులు వెల్లడించారు. కాదు బ్లాస్టింగ్‌లో చనిపోయారంటూ స్థానికులు ఆరోపించారు. ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

కాగా, గతంలోనూ మెళియాపుట్టి మండలంలోని ధీనబంధుపురం గ్రామ సమీపంలో ఓ గ్రానైట్ క్వారీలో 2025 మే 16 అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించి, ముగ్గురు కార్మికులు మృతి చెందారు. క్వారీ యాజమాన్యం మాత్రం పిడుగు పడటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, బ్లాస్టింగ్ జరగలేదని పేర్కొంది.

Next Story