Ap News: ప్రభుత్వ భూమి ఆక్రమణ.. తీవ్ర ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

మన్యం జిల్లా పార్వతీపురం మండలం బంటువానివలస గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది..

Ap News: ప్రభుత్వ భూమి ఆక్రమణ.. తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: మన్యం జిల్లా పార్వతీపురం మండలం(Parvathipuram Mandalam) బంటువానివలస గ్రామం(Bantuvanivalasa Village)లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ భూమి ఆక్రమణ(government land Encroachment)ను అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులు, పోలీసులను గ్రామస్తులు అడ్డుకున్నారు. వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కాగా గ్రామానికి చెందిన బంటుదాసు అనే వ్యక్తిపై ప్రభుత్వ భూమి ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో రెవెన్యూ అధికారులు ఈ రోజు చర్యలకు దిగారు. ఆక్రమించుకున్న భూమి వద్దకు జేసీబీలతో తీసుకెళ్లారు. ఆ భూమిలో నిర్మించిన నిర్మాణాలను తొలగించే ప్రయత్నం చేస్తారు. కానీ గ్రామస్తులు తిరగబడ్డారు. అది ప్రభుత్వ భూమి కాదని, బంటుదాస్ ఆక్రమించలేదని వాగ్వాదానికి దిగారు. గ్రామం నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. దీంతో చేసేదేమి లేక రెవెన్యూ, పోలీసు అధికారులు వెనుతిరిగి వెళ్లిపోయారు.

Next Story