కాశీబుగ్గలో దుర్ఘటన దురదృష్టకరం : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

by Thanuru Gopichand |

కాశీబుగ్గలో చోటు చేసుకున్న దుర్ఘటన దురదృష్టకరం అని కేంద్ర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం లోక్ సభ సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) అన్నారు.

కాశీబుగ్గలో దుర్ఘటన దురదృష్టకరం : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : కాశీబుగ్గలో చోటు చేసుకున్న దుర్ఘటన దురదృష్టకరం అని కేంద్ర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం లోక్ సభ సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) అన్నారు. కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందడం మనసును కలచివేసిందన్నారు. రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష, జిల్లా అధికారులతో కలిసి మృతుల కుటుంబాలను స్వయంగా పరామర్శించారు. వారి కుటుంబానికి జరిగిన నష్టం పట్ల సంతాపాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఎక్స్ గ్రేషియా చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం పలాసా (Palasa) ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న భక్తులను కూడా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై ఆసుపత్రి సిబ్బందిని ఆరా తీశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీనిచ్చారు.

Next Story