శ్రీకాకుళం ఎయిర్ పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధం

by Thanuru Gopichand |

శ్రీకాకుళం (Srikakulam) ఎయిర్ పోర్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. దీంతో ఉత్తరాంధ్రకు (Uttarandhra) మరో ఎయిర్ పోర్టు రానుంది.

శ్రీకాకుళం ఎయిర్ పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధం
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీకాకుళం (Srikakulam) ఎయిర్ పోర్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. దీంతో ఉత్తరాంధ్రకు (Uttarandhra) మరో ఎయిర్ పోర్టు రానుంది. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ముందుకు రావడంతో మరో అడుగు ముందుకు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) సమక్షంలో అందుకు సంబంధించిన ఒప్పందాన్ని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుదుర్చుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) సమక్షంలో అధికారులు ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు ఎయిర్ పోర్ట్ రాకతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనెక్టివిటీ పెరుగుతుందని, అలాగే పర్యాటక రంగానికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో ఈ ప్రాంతంలో ఆర్ధిక వృద్ధికి (Financial Growth) ఊతం లభిస్తుందని తెలిపారు. ఎయిర్ పోర్టు నిర్మాణానికి ప్రస్తుతం స్థల పరిశీలన జరుగుతోందన్నారు. మౌలిక వసతులు, రెగ్యులేటరీ అనుమతులపై ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏపీ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కలిసి పనిచేయనున్నాయి.

Next Story