- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆంధ్రుల సుదీర్ఘ నిరీక్షణకు తెర: పట్టాలెక్కిన దక్షిణ కోస్తా రైల్వే జోన్
రాష్ట్ర ప్రజల దశాబ్దాల నాటి కల ఎట్టకేలకు సాకారమైంది. విశాఖపట్నం కేంద్రంగా నూతనంగా ఏర్పాటైన 18వ రైల్వే జోన్—దక్షిణ కోస్తా రైల్వే (SCoR) కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రజల దశాబ్దాల నాటి కల ఎట్టకేలకు సాకారమైంది. విశాఖపట్నం కేంద్రంగా నూతనంగా ఏర్పాటైన 18వ రైల్వే జోన్—దక్షిణ కోస్తా రైల్వే (SCoR) కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సమీపంలోని ఏ.ఎస్.పేట రైల్వే ట్రాక్ వద్ద కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు నూతన జోన్ బోర్డును ఆవిష్కరించి, కొబ్బరికాయ కొట్టి దీనిని ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా ఆయన అక్కడ ఒక మొక్కను కూడా నాటారు.
గెజిట్ విడుదలతో లభించిన చట్టబద్ధత
ఈ నూతన రైల్వే జోన్‌కు సంబంధించిన చట్టబద్ధత ప్రక్రియ గత నెలలోనే పూర్తయింది. 2026 మే 4వ తేదీన కేంద్ర ప్రభుత్వం దీనిపై అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతో జోన్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. భారతీయ రైల్వే వ్యవస్థలోనే అత్యంత కీలకమైనదిగా, వ్యూహాత్మకమైనదిగా ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను పరిగణిస్తున్నారు. సుదీర్ఘ తీరప్రాంతం, ప్రముఖ నౌకాశ్రయాలతో అనుసంధానమై ఉండటం వల్ల దేశ ఆర్థిక, రవాణా రంగాల్లో ఇది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోనుంది.
రూ.1.06 లక్షల కోట్లతో రైల్వే మౌలిక వసతుల విప్లవం
ఈ నూతన జోన్ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతంలో రైల్వే మౌలిక సదుపాయాలు భారీగా మెరుగుపడనున్నాయి. జోన్ పరిధిలో సుమారు రూ.లక్షా 6 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో వివిధ రకాల అభివృద్ధి పనులు, అత్యాధునిక వసతులు సమకూరనున్నాయి. కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, స్టేషన్ల ఆధునీకరణ, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా, స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడనుంది.






