- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైయస్ జగన్ కు ముద్రగడ సంచలన లేఖ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ( Jagan ) ముద్రగడ పద్మనాభ రెడ్డి ( Mudragada Padmanabha Reddy) సం

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ( Jagan ) ముద్రగడ పద్మనాభ రెడ్డి ( Mudragada Padmanabha Reddy) సంచలన లేఖ రాశారు. వైసీపీ పార్టీలో PAC మెంబర్ గా నియామకం చేసినందుకుగాను వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ పదవి తనకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు ముద్రగడ పద్మనాభ రెడ్డి. తనపై ఉన్న అభిమానం అలాగే ప్రేమతో... పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ( Political Advisory Committee) మెంబర్ గా నియమించారని టీవీలో వార్త చూసి... చాలా సంతోషపడ్డానని ఈ లేఖలో వివరించారు.
తన పైన ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు.. వైసిపి పార్టీని ( YCP) మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత తాను కూడా తీసుకుంటానని ప్రకటించారు. వైసీపీ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా అడుగులు వేస్తామని... ఆ దిశగా కష్టపడతామని పేర్కొన్నారు. ఏపీలోని ప్రతి పేదవాడికి జగన్మోహన్ రెడ్డి ఆక్సిజన్ లాంటివాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మరోసారి జగన్మోహన్ రెడ్డి ( ys Jagan Mohan Reddy ) ముఖ్యమంత్రి అయితే.. 10 కాలాలపాటు ఉండి పోయేలా పాలన ఉంటుందన్నారు. ఏపీలో కచ్చితంగా వైసిపి అధికారంలోకి రాబోతుందని కూడా కీలక ప్రకటన చేశారు. కాగా తాజాగా... వైసీపీ పార్టీలో ఉన్న కీలక నేతలకు జగన్ మోహన్ రెడ్డి పదవులు ఇచ్చారు. ఇందులో భాగంగానే పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ( Political Advisory Committee) మెంబర్ గా ముద్రగడ పద్మనాభ రెడ్డికి అవకాశం ఇచ్చారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.






