బ్రహ్మంగారి కాలజ్ఞానం.. మేఘాలు ఊడి కింద పడిపోతుండటంతో జనాలు బెంబేలు.. నిజంగా శాపమే.. (వీడియో)

by Sujitha Rachapalli |

బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా ఇప్పటికే చాలా వింతలు జరిగాయి. యుద్ధాల కారణంగా బంగారం, ముడి చమురు ధరలు పెరుగుతాయని.. వింత చేష్టలతో అగ్రరాజ్యం చులకనైపోతుందని.. గోల్డ్ లక్ష దాటుందని.. ఆయన తాళపత్ర గ్రంథాల్లో రాసింది రాసినట్లుగా ఈ ఏడాది

బ్రహ్మంగారి కాలజ్ఞానం.. మేఘాలు ఊడి కింద పడిపోతుండటంతో జనాలు బెంబేలు.. నిజంగా శాపమే.. (వీడియో)
X

దిశ, వెబ్‌సైట్ : బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా ఇప్పటికే చాలా వింతలు జరిగాయి. యుద్ధాల కారణంగా బంగారం, ముడి చమురు ధరలు పెరుగుతాయని.. వింత చేష్టలతో అగ్రరాజ్యం చులకనైపోతుందని.. గోల్డ్ లక్ష దాటుందని.. ఆయన తాళపత్ర గ్రంథాల్లో రాసింది రాసినట్లుగా ఈ ఏడాది జరిగింది. అయితే పాపాలు పెరిగిపోయి ఆకాశం కిందపడుతుందని కూడా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పగా.. ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది. ఇదే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేస్తూ.. మేఘాలు కింద పడుతున్నాయని ప్రచారం చేస్తున్నారు. ఇది నిజంగా శాపమేనని చెప్తుండగా జనాలు బెంబేలెత్తుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో తెలుపు రంగులో ఉన్న నురగ లాంటి పదార్థం కింద పడగా.. దీన్ని మేఘాలు కింద పడినట్లుగా చెప్తున్నారు. విజయవాడ, వైజాగ్‌లో కూడా ఇది జరగబోతుందని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కానీ నిజానికి మేఘాలు కింద పడటం జరగదని ఇదంతా రూమర్ అని వివరిస్తున్నారు నిపుణులు. సైంటిఫిక్‌గా మేఘాలు నీటి ఆవిరిగా ఉంటాయని.. వర్షంగా కురుస్తాయని.. ఘన పదార్థంగా కిందపడే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఇది నురుగు లేదా డ్రై ఐస్ వంటి కృత్రిమ పదార్థాలను సూచిస్తుందని.. భయపడాల్సిన అవసరం లేదంటున్నారు.

VIDEO

Next Story