- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ నేతకు రెండో పెళ్లి చేయబోతున్న వేణు స్వామి ?
ముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu swamy ) గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో వేణు స్వామి ప

దిశ. వెబ్ డెస్క్: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu swamy ) గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో వేణు స్వామి పేరు ఇప్పటికి కూడా మారుమవుతూనే ఉంది. అక్కినేని నాగచైతన్య ( Akkineni Nagachaitanya ) , సమంత ( Samantha) విడాకులు తీసుకుంటారని వాళ్ళ పెళ్లి ఫిక్స్ కాగానే మీడియా ఛానల్లో పేర్కొన్నాడు వేణు స్వామి. ఆ తర్వాత వేణు స్వామి చెప్పిందే జరిగింది. దీంతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు వేణు స్వామి. అయితే అలాంటి వేణు స్వామి ఇప్పుడు... వైసీపీ నేతకు పెళ్లి చేయబోతున్నారట.
దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో అందరూ ఇది నిజమే అని అనుకుంటున్నారు. తాజాగా వైసీపీ నేత (YCP) దువ్వాడ శ్రీనివాస్ ( Duvvada Srinivas ) అలాగే ఆయన ప్రియురాలు మాధురి ( Madhuri )... ఇద్దరూ కలిసి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా షాపింగ్ చేసుకున్న తర్వాత ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇంటికి వెళ్లారు. ఈ తరుణంలోనే దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురిని వేణు స్వామి, ఆయన భార్య వీణ ఆహ్వానించారు. అనంతరం విందు భోజనం కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే వేణు స్వామి ఇంటికి వెళ్లినట్లు.. దువ్వాడ శ్రీనివాస్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఫోటోలు కూడా షేర్ చేశాడు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వైసీపీ నేత పెళ్లి చేయడానికి వేణు స్వామి ముహూర్తం పెట్టినట్లు ఉన్నాడు.. అందుకే వీళ్ళ కలయిక జరిగిందని ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అయితే, మర్యాదపూర్వకంగా మాత్రమే.. వేణు స్వామి కలిసినట్లు... దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్నారు.






