Dharmana Krishnadas: కుల రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుల రాజకీయాలు చేసేందుకు టీడీపీ యత్నిస్తుందని ఆ ట్రాప్‌లో పడొద్దని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు...

Dharmana Krishnadas: కుల రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుల రాజకీయాలు చేసేందుకు టీడీపీ యత్నిస్తుందని ఆ ట్రాప్‌లో పడొద్దని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. కవిటి మండలం బల్లి పుట్టుగలో జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ నివాసం వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రధానమైన కాపు, కాళింగ, వెలమ సామాజిక వర్గాలకు రెండు చొప్పున శాసనసభ్యుల పదవులున్నాయని చెప్పారు. అయితే జిల్లాలో మరో ప్రధానమైన యాదవ సామాజిక వర్గానికి సముచితమైన పదవిని ఇవ్వాలనే యోచనలో భాగంగా సీఎం జగన్ స్థానిక సంస్థల కోటాలో నర్తు రామారావుని శాసనమండలికి ఎంపిక చేశారని స్పష్టం చేశారు.

అయితే కొంతమంది టీడీపీ నాయకుల అండతో కాపుల ప్రతినిధులమని కొందరు కుల రాజకీయాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వాటిని పట్టించుకోవద్దన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీతంరాజు సుధాకర్‌ను గెలిపించాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు.

Next Story