- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పోర్టుకు పోదాం రండి’ కార్యక్రమం ఓ డ్రామా : దువ్వాడ శ్రీనివాస్
వైసీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నాయకత్వంలో చేపట్టిన ‘మూలపేట పోర్టుకు పోదాం రండి’ కార్యక్రమం అంతా ఒక రాజకీయ డ్రామా అని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నాయకత్వంలో చేపట్టిన ‘మూలపేట పోర్టుకు పోదాం రండి’ కార్యక్రమం అంతా ఒక రాజకీయ డ్రామా అని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. నాయకులు ప్రజలను మభ్యపెట్టి తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తాజాగా ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
పోర్టుకు వెళ్లకుండా టెంటులో మీటింగా?
పోర్టును పరిశీలిద్దాం రండి అని గొప్పగా పిలుపునిచ్చిన వైసీపీ నేతలు.. తీరా అక్కడికి వెళ్లకుండా 10 కిలోమీటర్ల దూరంలోనే టెంటు వేసి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ‘పోర్టు లోపలికి ఎందుకు వెళ్లలేదు?’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. వాస్తవానికి 40 మంది నాయకులు, ప్రతినిధులు పోర్టు లోపలికి వెళ్లి పనులను పరిశీలించేందుకు స్పష్టమైన అవకాశం ఉన్నప్పటికీ, ఆ దిశగా కనీస ఆలోచన చేయలేదన్నారు. ప్రజలను కేవలం మభ్యపెట్టడానికే ఈ సభను వాడుకున్నారని దువ్వాడ ఆరోపించారు.
నిర్వాసితుల త్యాగాలు గుర్తులేవా?
అక్కడ ఏర్పాటు చేసిన సభలో స్థానిక సమస్యలను పూర్తిగా గాలికొదిలేశారని దువ్వాడ ధ్వజమెత్తారు. ముఖ్యంగా పోర్టు కోసం భూములిచ్చిన నిర్వాసితుల బాధల గురించి కానీ, 100 మీటర్ల రహదారి కోసం తమ ఆస్తులను త్యాగం చేసిన వారి ఇబ్బందుల గురించి కానీ సభలో కనీసం ప్రస్తావించకపోవడం అన్యాయమన్నారు.






