- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిరిజనులకు తప్పని డోలీ మోతలు.. గర్భిణితో రెండు కిలోమీటర్ల నడక!
by Ramesh Naini |
శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు లేక ప్రజలు ఇంకా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు లేక ప్రజలు ఇంకా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా లింగాపురం గిరిజనగూడకు చెందిన సునీత అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు నరకయాతన పడ్డారు. రోడ్డు మార్గం లేకపోవడంతో ఆమెను సుమారు రెండు కిలోమీటర్ల మేర డోలీలో మోసుకుంటూ వెళ్లి, అక్కడి నుంచి ఆటోలో పాతపట్నం ఆసుపత్రికి తరలించారు.
గర్భిణులు, బాలింతలు, వృద్ధులు అస్వస్థతకు గురైనప్పుడు ఆస్పత్రులకు తీసుకెళ్లాలంటే వారికి డోలీనే ఏకైక దిక్కవుతోంది. రహదారి నిర్మిస్తామని రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ కష్టాలు మాత్రం తీరడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






